Pushpa 2 Sooseki Song: సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, పుష్ప 2 నుండి రెండో సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది, మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్

Pushpa 2 Sooseki Song

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి రెండో సాంగ్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’అంటూ సాగే ఈ కపుల్‌ సాంగ్‌ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. శ్రీవల్లి వదినా..పుష్ప 2 నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేస్తున్నారట కదా.. ఆ పాట ఏంటో చెబుతావా’ అని చిత్తూరు యాసలో ఓ వ్యక్తి అడగ్గా.. మేకప్‌ వేసుకుంటున్న రష్మిక వచ్చి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో  రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తుంది వీడియోలో. పుష్ప 2 ది రూల్ నుంచి అనసూయ భరద్వాజ్ దాక్షాయణి ఫస్ట్ లుక్ ఇదిగో, అనసూయ టేబుల్‌పై ఠీవీగా కూర్చొన్న స్టిల్‌ నెట్టింట వైరల్

ఈ రొమాంటిక్‌ సాంగ్‌ని మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.  ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఆగస్ట్‌ 15న ఈ చిత్రం విడుదల కానుంది

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)