సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో వస్తున్న పుష్ప 2 ది రూల్ అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ దుమ్ముపుతుండగా తాజాగా అనసూయకు బర్త్‌ డే విషెస్‌ తెలియజేస్తూ.. ఈ మూవీ నుంచి దాక్షాయణి పాత్ర లుక్‌ను విడుదల చేశారు. అనసూయ టేబుల్‌పై ఠీవీగా కూర్చొన్న స్టిల్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దాక్షాయణి భర్త పాత్రలో మంగళం శ్రీనుగా మరోసారి అలరించబోతున్నాడు సునీల్‌.

పుష్ప పార్టు 1లో అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) పోషించిన దాక్షాయణి పాత్రకు ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు సీక్వెల్‌లో అనసూయ రోల్‌ అంతకుమించి ఉండబోతుందని తాజా లుక్‌ చెప్పకనే చెబుతోంది. ఈ మూవీ ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇండియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2, విడుదలైన ఆరు భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా వీక్షించబడిన లిరికల్ పాటగా సెన్సేషన్

ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్‌ నటిస్తోండగా.. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Here's Look

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)