Klin Kaara Konidela Welcome Video: చిరంజీవి మనవరాలు క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియో ఇదిగో, ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందంటూ సాగిన వీడియో
ఈ రోజు(జూలై 20) రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన సతీమణి ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రామ్‌చరణ్ తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఈ పదకొండేళ్ల తమ వైవాహిక బంధంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు.
ఈ రోజు(జూలై 20) రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన సతీమణి ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రామ్‌చరణ్ తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఈ పదకొండేళ్ల తమ వైవాహిక బంధంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు. ఈ రోజుతో తమ కుమార్తె క్లీంకార జన్మించి నెల రోజులు అవుతోన్న సందర్భంగా.. పాప పుట్టిన సమయంలో (జూన్ 20) తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న అంశాన్ని ఈ వీడియోతో ఆయన తెలియజేశారు.
క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు. ఈ వీడియోలో లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నారు. రామ్ చరణ్ ల పెళ్లి, ఇంకా పిల్లలు పుట్టలేదని సాగిన ప్రచారం, రామ్ చరణ్ ఆవేదన, ఉపాసన గర్భవతి కావడం, ఆమెకు అపోలో ఆసుపత్రిలో ప్రసవం, మెగా ఇంట సంబరాలు, పాపకు బారసాల, నామకరణం... ఇలా వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)