Radhe Shyam Release Date: ప్రేమకి .. విధికి జరిగే పోరాటం, మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ విడుదల, అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు.
ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' ఎట్టకేలకు విడుదలకు రెడీ అయింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు.
ప్రేమకి .. విధికి జరిగే పోరాటాన్ని చూడమని ఈ పోస్టర్ ద్వారా చెబుతూ ఆసక్తిని రేకెత్తించారు. భవిష్యత్తులో ఏం జరగనుందో తెలిసి కూడా దానిని మార్చడానికి కథానాయకుడు చేసే పోరాటమే ఈ కథ. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ కనిపించనుండగా, ముఖ్యమైన పాత్రల్లో కృష్ణంరాజు .. జగపతిబాబు .. సత్యరాజ్ కనిపించనున్నారు. టి - సిరీస్ .. యూవీ క్రియేషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)