Republic Movie Trailer: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్‌ మూవీ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి, అక్టోబరు 1న సినిమా విడుదల

Republic Movie Trailer (photo-Twitter/Video grab)

సాయి తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్‌గా నటించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్‌’ట్రైలర్‌ని బుధవారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశాడు. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కలెక్టర్‌ పంజా అభిరామ్‌ పాత్రలో నటించారు సాయితేజ్‌.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now