Salaar Trailer Date Fix: ప్రభాస్ ఫ్యాన్స్‌ కు బిగ్ అప్‌ డేట్.. ‘సలార్’ ట్రైలర్ వచ్చేది ఆ రోజే.!

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది.

salaar (Credits: X)

Newdelhi, Nov 12: పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ (Salaar) ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), ప్రభాస్‌ (Prabhas) కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన Salaar Part-1 Ceasefire టీజర్‌ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను ఎప్పుడు లాంఛ్ చేస్తారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే ఈ ట్రైల‌ర్ లాంఛ్ పై సాలిడ్ న్యూస్ ఇచ్చారు మేక‌ర్స్. స‌లార్ ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 01 రాత్రి రాత్రి 7 గంట‌ల 19 నిమిషాలకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Ayodhya Deepotsav World Record: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. 21 లక్షల దీప కాంతుల నడుమ మిరిమిట్లు గొలిపిన అయోధ్య నగరం.. ప్రపంచ రికార్డు (వీడియోలతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)