Salim Ghouse Die: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు సలీమ్ గౌస్ గుండెపోటుతో కన్నుమూత, తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు

హిందీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు సలీమ్ గౌస్ కన్నుమూశారు. ఆయన వయసు 70 ఏళ్లు. సలీమ్ గౌస్ ముంబయిలో ఈ వేకువజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన భార్య అనితా గౌస్ వెల్లడించారు.

Salim Ghouse Dies at 70

హిందీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు సలీమ్ గౌస్ కన్నుమూశారు. ఆయన వయసు 70 ఏళ్లు. సలీమ్ గౌస్ ముంబయిలో ఈ వేకువజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన భార్య అనితా గౌస్ వెల్లడించారు. ఆయన గతరాత్రి నుంచే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పారని, దాంతో ఆయనను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించామని వివరించారు. చికిత్స పొందుతూ మరణించాడని వెల్లడించారు. సలీమ్ గౌస్ తెలుగులోనూ పలు చిత్రాల్లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషించారు.

నాగార్జున నటించిన అంతం, రక్షణ, చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోనూ సలీమ్ గౌస్ నటించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తిరుడా తిరుడా (తెలుగులో దొంగ దొంగ) చిత్రంలోనూ ఆయన తన నటనా ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ నటుడు సలీమ్ గౌస్ మృతితో వివిధ చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement