Samantha: మయోసైటిస్‌ అనే వింత వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇన్ స్టాగ్రాం పోస్టు ద్వారా వెల్లడి

Samantha Ruth Prabhu (Photo-Facebook)

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. గత కొన్ని నెలల నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. అయితే, నేను అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. మనం అన్ని సార్లూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని అర్థమైంది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. నేను పూర్తిగా కోలకునే రోజు అతి దగ్గర్లోనే ఉంది. ఐ లవ్‌ యూ’ అంటూ రాసుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now