SSMB29 Update: మహేశ్‌ బాబు-రాజమౌళి సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన జక్కన్న, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది ఇక పట్టాలెక్కడమే తరువాయి అని వెల్లడి

తన తర్వాతి ప్రాజెక్ట్‌ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు.మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు.

SS Rajamaouli and Mahesh Babu (Photo-X)

మహేశ్‌ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా SSMB29 త్వరలో పట్టాలెక్కనున్నట్లు దర్శకధీరుడు రాజమౌళి తెలిపారు. దాదాపు రూ. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్‌ ఇచ్చారు.జపాన్‌లో RRR మూవీ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు.ఈ క్రమంలోనే తన తర్వాతి ప్రాజెక్ట్‌ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు.మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మగధీర, మార్చి 26న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల, మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు

SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్‌ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్‌లో జక్కన్న వ్యాఖ్యానించారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now