Actor Ramadoss Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు ఈ.రామదాస్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన తమిళ సినీ ప్రముఖులు

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ దర్శకుడు, నటుడు ఈ.రామదాస్‌(66) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. స్థానిక కేకే.నగర్‌ మునస్వామి వీధిలో నివసిస్తున్న రామదాస్‌ మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురై స్థానిక చూలైమేడులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

E Ramadoss (Photo-Video Grab)

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ దర్శకుడు, నటుడు ఈ.రామదాస్‌(66) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. స్థానిక కేకే.నగర్‌ మునస్వామి వీధిలో నివసిస్తున్న రామదాస్‌ మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురై స్థానిక చూలైమేడులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దర్శకుడి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామదాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన రాజా రాజాదాన్, కల్యాణం, రావణన్, వాళ్గ జననాయకంనెంజం ఉండు నేర్మై ఉండు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అధేవిధంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

Here's Update

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now