Tarun Majumdar Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ దర్శకుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత తరుణ్ మజుందార్ కన్నుమూత
92 ఏళ్ల తరుణ్ గత కొంతకాలంగా వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందు కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (జులై 4) తుది శ్వాస విడిచారు.
ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ కన్నుమూశారు. 92 ఏళ్ల తరుణ్ గత కొంతకాలంగా వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందు కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (జులై 4) తుది శ్వాస విడిచారు. 1959లోని 'చోవా పావా' సినిమాతో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు 'యాత్రిక్' పేరుతో సచిన్ ముఖర్జీ, దిలీప్ ముఖర్జీలతోపాటు తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించారు. 1960, 70, 80 దశకాల్లో మజుందార్ తెరకెక్కించిన శ్రీమాన్ పృథ్వీరాజ్, కుహెలి, బాలికా వధు, దాదర్ కీర్తి లాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1990లో పద్మశ్రీ పురస్కారం వరించగా పలు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)