Director Surya Kiran Dies: పచ్చ కామెర్లకు చికిత్స పొందుతూ టాలీవుడ్‌ దర్శకుడు సూర్య కిరణ్‌ మృతి, సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు

టాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సూర్య కిరణ్‌ (51) కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలుస్తోంది

Tollywood director and actor Surya Kiran died of jaundice

టాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సూర్య కిరణ్‌ (51) కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలుస్తోంది. మాస్టర్‌ సురేష్‌' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. కానీ మొదటి వారంలోనే ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు.  ప్రముఖ పోర్న్ తార ఎమిలీ విల్లీస్‌కు గుండెపోటు, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న అడల్ట్ ఫిల్మ్ స్టార్

హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న‌ సూర్యకిరణ్‌ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయంలో ఆయన పలు కాంట్రవర్శీలతో వార్తల్లో నిలిచాడు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను అందుకున్న సూర్య కిరణ్‌.. దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను అందుకున్నాడు. సూర్యకిరణ్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement