Tarakaratna Health Update: తారకరత్న కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి

సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్‌ చిరంజీవి..ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..తారకరతన్న కోలుకుంటున్నారని తెలిసి తనకు చాలా సంతోషం కలిగిందన్నారు.

chiranjeevi (photo-IANS)

సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్‌ చిరంజీవి..ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..తారకరతన్న కోలుకుంటున్నారని తెలిసి తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. ‘‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుండి తారకరత్నను కాపాడిన ఆ డాక్టర్లకి, భగవంతుడికి కృతజ్ఞతలు.నువ్వు నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను మై డియర్‌ తారకరత్న’’ అంటూ చిరు ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం చిరు షేర్‌ చేసిన ఈ పోస్ట్‌తో నెట్టింట వైరల్‌గా మారింది.

Here's Chiru Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement