Godfather First Look: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ లుక్ వచ్చేసింది, నళ్ల కద్దాలు పెట్టుకుని, చేతికి వాచీతో, జేబులో పెన్నుతో చిరు ఎంట్రీ

మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ లుక్ విడుదలైంది. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నపాటి వీడియో రిలీజ్‌ చేశారు

Megastar Chiranjeevi's Godfather First Look

మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ లుక్ విడుదలైంది. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నపాటి వీడియో రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో చిరు నళ్ల కద్దాలు పెట్టుకుని, చేతికి వాచీతో, జేబులో పెన్నుతో ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు.

విడుదలైన వీడియోలో రోడ్డుకు ఇరువైపులా జనం జెండాలు పట్టుకుని నిలబడగా మధ్యలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి చిరు దిగి స్టైలిష్‌గా నడుచుకుంటూ లోనికి వెళ్లాడు. ఆయన నడకకు తగ్గట్టు తమన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. చిరంజీవికి ఇది 153వ చిత్రం కాగా ఇందులో సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now