G.G. Krishna Rao Dies: తారకరత్న మరణం మరువక ముందే..సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రముఖులు
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్ పని చేసిన జీజీ కృష్ణారావు(87) ఈ రోజు ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్ పని చేసిన జీజీ కృష్ణారావు(87) ఈ రోజు ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా జీజీ కృష్ణారావు పలు భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగులో దాసరి నారాయణరావు, కళాతపస్వి కె విశ్వనాథ్, బాపు, జంధ్యాల వంటి దిగ్గజ దర్శకుల సినిమాలకు పని చేసి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు.
కె విశ్వనాథ్ క్లాసికల్ హిట్స్ ‘‘శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభలేఖ, శృతి లయలు, సిరివెన్నెల, శుభ సంకల్పం, స్వరాభిషేకం’’ సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు.అలాగే దర్శక రత్న దాసరి నారాయణ రావు ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాలకు కూడా పని చేశారు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలతో ఆయన ఆస్థాన ఎడిటర్ అని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలతో పాటు కళాత్మక చిత్రాలకు కూడా ఎడిటింగ్ చేసి శభాష్ అనిపించుకున్నారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)