Dilip Kumar Hospitalised: అస్వస్థతకు గురైన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్, శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రిలో చేరిక, చికిత్స అందిస్తున్న సీనియర్ వైద్యులు నితిన్ గోఖలే, జలీల్ పార్కర్
బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ అస్వస్థతకు లోనయ్యారు. కొంతకాలంగా ఆయన శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 98 ఏళ్ల వయసున్న ఈ నటుడిని సీనియర్ వైద్యులు నితిన్ గోఖలే, జలీల్ పార్కర్ పర్యవేక్షిస్తున్నారు. దిలీప్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన 1944 లో జ్వార్ భాటాతో వెండితెరపై కాలు మోపారు. కోహినూర్, ఆజాద్, మొఘల్-ఎ-అజామ్, బైరాగ్, శక్తి, దేవదాస్, గోపి, ఆద్మీ, సంఘర్ష్ వంటి పలు చిత్రాలలో నటించారు. చివరిసారిగా 1998లో 'ఖిలా' చిత్రంలో కనిపించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement