Saran Raj Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, తప్పతాగి అసిస్టెంట్ డైరక్టర్‌ని కారుతో గుద్దిన మరో నటుడు, తమిళ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ మృతి

తమిళ సినీ పరిశ్రమకే చెందిన మరో నటుడు పళనియప్పన్‌ తప్పతాగి కారు నడుపుతూ.. బైక్‌పై వెళ్తున్న శరన్‌ రాజ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరన్‌ రాజ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు

Representative image. (Photo Credits: Unsplash)

తమిళ సినిమా నటుడు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ (29) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తమిళ సినీ పరిశ్రమకే చెందిన మరో నటుడు పళనియప్పన్‌ తప్పతాగి కారు నడుపుతూ.. బైక్‌పై వెళ్తున్న శరన్‌ రాజ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరన్‌ రాజ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.చెన్నై మహా నగరంలోని కేకే నగర్‌ ఏరియాలోగల ఆర్కోట్‌ రోడ్డులో గురువారం అర్ధరాత్రి 11.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. శరన్‌ రాజ్‌ ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)