Vijayakanth Health Update: డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారాన్ని ఖండించిన భార్య ప్రేమలత, తప్పుడు వార్తలను నమ్మొద్దని వీడియో ద్వారా విన్నపం
ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ... కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని... తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని... త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు.
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ... కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని... తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని... త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు.
ప్రస్తుతం విజయకాంత్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విజయకాంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. గత 10 రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)