Chethana Raj Dies: కాస్మోటిక్‌ సర్జరీ వికటించడంతో స్టార్ నటి మృతి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించిన కన్నడ టీవీ నటి చేతనా రాజ్‌

కాస్మోటిక్‌ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్‌ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్‌ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట.

Chethana Raj

కన్నడ టీవీ నటి చేతనా రాజ్‌(21) మృతి చెందారు. కాస్మోటిక్‌ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్‌ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్‌ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట. దీంతో డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్‌లోని కడే ఆసుపత్రికి ఆమె తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే చేతనా మరణించినట్టు అక్కడి వైద్యులు తెలిపారు.ఇదిలా ఉంటే చేతనా రాజ్‌ను తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు కడే హాస్పిటల్‌ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చేతనా రాజ్‌ కన్నడలో పలు టీవీ షోలు, సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)