Pakkinti Kurradu Chandoo Sai Arrest: బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి యువతిపై అత్యాచారం, పక్కింటి కుర్రాడు క్రియేటర్ చందుసాయిని అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రముఖ యూట్యూబర్‌ చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్స్‌ క్రియేటర్ నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Pakkinti Kurradu Chandoo Sai (Photo-Video Grab)

ప్రముఖ యూట్యూబర్‌ చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్స్‌ క్రియేటర్ నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన యువతికి యూట్యూబర్‌ చందుసాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 2021 ఏప్రిల్‌ 25న బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు.

పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు చందుపై అత్యాచారం, మోసం కింద కేసులు నమోదు చేశారు. చందుతో పాటు అతడి తల్లిదండ్రులు సహా మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.చందుగాడు యూట్యూబ్‌ ఛానల్‌కు ఐదున్నర లక్షల పైచిలుకు సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

Heres' News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement