UnstoppableNBKS2: ప్రభాస్ అన్‌స్టాపబుల్ సీజన్-2 సెకండ్ ప్రోమో వచ్చేసింది, డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగ ముందే రాబోతోందని ట్వీట్ చేసిన ఆహా యాజమాన్యం

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 ఎపిసోడ్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి హాజరవుతున్న పార్ట్-2 ప్రోమో రిలీజైంది. అయితే ఇప్పటికే ఓ ఎపిసోడ్‌ ప్రసారం కాగా.. మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది.

Unstoppable with NBK (Photo-Aha/Video Grab)

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 ఎపిసోడ్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి హాజరవుతున్న పార్ట్-2 ప్రోమో రిలీజైంది. అయితే ఇప్పటికే ఓ ఎపిసోడ్‌ ప్రసారం కాగా.. మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ ప్రోమోలో బాలకృష్ణ.. ప్రభాస్, గోపీచంద్‌ను సరదా ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ ప్రోమోలో ప్రభాస్, గోపీచంద్‌ మధ్య మరింత సన్నివేశాలు ఆసక‍్తి పెంచుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస‍్తోంది. 'డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగ ముందే రాబోతోంది. మాకో స్టార్ గోపీచంద్‌తో ఫ్రెండ్షిప్ కథలు, బాహుబలి సినిమా విజయంపై సరదా ప్రశ్నలతో మరింత ఆసక్తి పెరుగుతోంది. జనవరి 6 వరకు వేచి ఉండండి.' అంటూ ఆహా ట్వీట్ చేసింది. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం కానున్నట్లు ఆహా ప్రకటించింది.

Here's Promo

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement