Cancellation of Trains: భారీ వర్షాలు, పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు ప్రకటన

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Train (Photo Credits: PTI)

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్‌ రైల్వేజోన్‌ పరిధిలోని ఇగత్‌పురి-లోనావాలా, కొల్హాపూర్‌-మిరాజ్‌ సెక్షన్ల మధ్య కొండచరియలు విరిగిపడటంతో 14 రైళ్లను రద్దుచేశారు.

ఈనెల 24-28తేదీల మధ్య.. నాలుగు రైళ్లు ఒక్కో రోజు, పది రైళ్లు నాలుగు రోజుల చొప్పున రద్దయ్యాయి. ఇతర రూట్లలో నడిచే ముంబయి-తిరువనంతపురం, 21, 22, 23 తేదీల్లో బయల్దేరిన వెరవల్‌-తిరువనంతపురం, చండీగఢ్‌-కొచ్చువేళి, హిస్సార్‌-కొయంబత్తూరుల మధ్య నడిచే రైళ్లను వర్షాల నేపథ్యంలో దారి మళ్లించి నడిపినట్లు రైల్వేశాఖ పేర్కొంది. 23న బయల్దేరాల్సిన తిరుపతి-కొల్హాపూర్‌, 26న బయల్దేరాల్సిన హౌరా-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లను రైల్వేశాఖ రద్దుచేసింది. 22, 23 తేదీల్లో బయల్దేరిన ఎర్నాకుళం-హజ్రత్‌ నిజాముద్దీన్‌, పోరుబందర్‌-కొచ్చువేళి, కేఎస్‌ఆర్‌ బెంగళూరు-అజ్మీర్‌ రైళ్లను దారి మళ్లించారు.

Here's South Central Railway Statement

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement