TSRTC Bumper Offer: టీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. 10 శాతం రాయితీతో రూ.100 వరకు ఆదా.. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణించేవారికి రాయితీ

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) బంపర్ ఆఫర్ (Bumper Offer) ఇచ్చింది. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టిక్కెట్‌పై పది శాతం రాయితీ (Discount) కల్పించాలని నిర్ణయించింది.

Lahari Bus in TSRTC (Photo-IANS)

Hyderabad, July 2: దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) బంపర్ ఆఫర్ (Bumper Offer) ఇచ్చింది. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టిక్కెట్‌పై పది శాతం రాయితీ (Discount) కల్పించాలని నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించేవారు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై పది శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఈ రాయితీ సేవలు జులై 2, ఆదివారం నుండి అందుబాటులోకి వస్తాయి. అయితే ఇది పరిమిత రాయితీ. ఆగస్ట్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. రానుపోను ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10% రాయితీ ఉంటుందని, ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ రూట్లో రూ.50 వరకు, బెంగళూరు రూట్లో రూ.100 వరకు ఆదా అవుతుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement