US India Trade Dispute: భారత్ పూర్తిగా ఏకపక్షంగా వెళుతోంది, ప్రధాని మోదీ చైనా పర్యటన వేళ మళ్లీ ఆక్రోశాన్ని వెళ్లగక్కిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం–యుఎస్ వాణిజ్య సంబంధాలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. భారత్ అమెరికాతో తక్కువ వ్యాపారం చేస్తుంది, కానీ భారత్ మాత్రం అమెరికా నుండి చాలా వస్తువులను కొంటుంది.భారతదేశం మనకు అత్యంత పెద్ద కస్టమర్, కానీ మేము వారికి అత్యల్పంగా అమ్ముతామని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.ట్రంప్ తన పోస్టులో భారతదేశం సుంకాలను తగ్గించడానికి ముందుకొచ్చినప్పటికీ, ఇది ఆలస్యం అవుతోందని సూచించారు.
భారతదేశం.. రష్యా నుండి ఎక్కువ చమురు, సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది, కానీ యుఎస్ నుండి మాత్రం కొంత మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతోందని చెప్పారు. ఇది కూడా వ్యాపార అసమతుల్యతను పెంచే అంశంగా ఆయన అభివర్ణించారు. షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో సమావేశమయ్యాక కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో.. అమెరికా–భారత వాణిజ్య సంబంధాలపై చర్చలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ట్రంప్ చేసిన ఈ విమర్శలు.. భారత్–యుఎస్ వాణిజ్య చర్చలపై కొత్త ఒత్తిడి నెలకొల్పినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ పోస్టు భారత వ్యాపార, సాంకేతిక, ఎగుమతుల రంగాలపై ప్రభావాన్ని చూపేలా.. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణంలో కొత్త చర్చలకు తెర లేపిందని చెప్పవచ్చు.
Donald Trump Slams 'One-Sided' US-India Trade
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)