Indian Citizenship Renounced Row: 16 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదిలేశారు, గతేడాది రెండు లక్షల మంది ఇండియాను వదిలారని తెలిపిన కేంద్ర మంత్రి జైశంకర్
ఈ కాలంలో అత్యధికంగా 2020లో 85,256 మంది ఉన్నారు, ప్రభుత్వ డేటా ప్రకారం. పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్యను ఏడాది వారీగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా అందించారు
Indians renounced their Indian citizenship: 2011 నుండి 16 లక్షల మంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు, గత ఏడాది 2,25,620 మంది భారత పౌరసత్వం వదిలేసుకున్నారు. ఈ కాలంలో అత్యధికంగా 2020లో 85,256 మంది ఉన్నారు, ప్రభుత్వ డేటా ప్రకారం. పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్యను ఏడాది వారీగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా అందించారు .2015లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 1,31,489 కాగా, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు.
2018లో ఆ సంఖ్య 1,34,561, కాగా 2019లో 1,44,017గా ఉంటే 2020లో పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య 85,256, అలాగే 2021లో 1,63,370గా ఉందని మంత్ని జై శంకర్ తెలిపారు. 2022 లో సంఖ్య 2,25,620గా ఉందన్నారు. 2011 నుంచి మొత్తంగా 16,63,440 భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి తెలిపారు. ఇక గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందారని ఆయన చెప్పారు. భారతీయులు పౌరసత్వం పొందిన 135 దేశాల జాబితాను కూడా జైశంకర్ అందించారు.
Here's PTI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)