Assam Floods: అస్సాంలో వరదల విలయం, ప్రమాదకరంగా మారిన బ్రహ్మపుత్ర నది, ఇళ్లలోకి నీళ్లు చేరడంతో 34 వేల మంది రోడ్డు మీదకు..

ధేమాజీ, దిబ్రూఘర్‌, లఖింపూర్‌ జిల్లాలోని 46 గ్రామాలను వదరలు ముంచెత్తాయి.

Assam Floods (Photo-ANI)

గత రెండు రోజులుగా అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.వర్షాల కారణంగా వాగులు, వంకలు పొర్లి పొంగుతున్నాయి. ధేమాజీ, దిబ్రూఘర్‌, లఖింపూర్‌ జిల్లాలోని 46 గ్రామాలను వదరలు ముంచెత్తాయి.34 వేల మంది వరదల ధాటికి నిరాశ్రయులుగా మారారు. భారీ వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరదల కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. పొలాల్లోకి వరద నీరు చేరడంతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)