Kurla Fire: ముంబైలో భారీ అగ్నిప్రమాదం, కాపాడంటూ బాల్కనీల్లోకి వచ్చి హాహాకారాలు, పెనుప్రమాదంగా ప్రకటించిన ముంబై ఫైర్ డిపార్ట్ మెంట్, 20మందిని క్షేమంగా తీసుకువచ్చిన సిబ్బంది, ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

ఓ రెసిడెన్షియన్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగకమ్ముకుంది. మూడో అంతస్తులో చెలరేగిన మంటలు…క్రమంగా ఇతర ఫ్లోర్లకు వ్యాప్తించాయి. దాంతో బిల్డింగ్లో ఉన్నవాళ్లని ఖాళీ చేయించారు.

Credit @ ANI Twitter

Mumbai, OCT 08: ముంబైలోని తిలక్ నగర్‌లో (Mumbai Fire) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెసిడెన్షియన్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగకమ్ముకుంది. మూడో అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా ఇతర ఫ్లోర్లకు వ్యాప్తించాయి. దాంతో బిల్డింగ్‌లో ఉన్నవాళ్లని ఖాళీ చేయించారు. కొందరు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బాల్కనీల్లోకి వచ్చారు. సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది వారిని కాపాడారు. ఈ ఘటనలో 20మందిని కాపాడామని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.