Heroin Seized: షాకింగ్ వీడియో, సూట్‌కేసులోని రహస్య పొరలో రూ.69.95 కోట్ల హెరాయిన్‌ స్మగ్లింగ్, నిందితుడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.బెల్జియం జాతీయుడైన ఓ ప్రయాణికుడు.. జోహన్నెస్‌బర్గ్‌ నుంచి ధోహా మీదుగా ఢిల్లీకి వచ్చాడు.

Represerntational Image (Photo credits: stevepb/Pixabay)

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.బెల్జియం జాతీయుడైన ఓ ప్రయాణికుడు.. జోహన్నెస్‌బర్గ్‌ నుంచి ధోహా మీదుగా ఢిల్లీకి వచ్చాడు. ఎయిర్‌పోర్టులో అతని తీరును అనుమానించిన కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా ఏకంగా 9 కిలోల హెరాయిన్‌ లభించింది. దాని విలువ రూ.69.95 కోట్లు ఉంటుందని తెలిపారు. అధికారుల కళ్లుగప్పడం కోసం నిందితుడు తెలివిగా సూట్‌కేసులోని రహస్య పొరలో హెరాయిన్‌ను సీల్‌ చేశాడు. అయినా కస్టమ్స్‌ అధికారులు దాన్ని కనిపెట్టి నిందితుడిని పట్టుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement