Amritsar Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్, సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులు హతం, ఘటనా స్థలం నుంచి ఏకే 47, పిస్తోళ్లు స్వాధీనం
పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్స్ చీతాబక్నా ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
అమృత్‌సర్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ సమీపంలో ఈ ప్రాంతం ఉంది. దీంతో అక్కడ నిర్బంధ తనిఖీలు నిర్వహించి పోలీసు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. వీరిని చూసిన గ్యాంగ్‌స్టర్స్ కాల్పులు జరపడం వల్ల ఎన్‌కౌంటర్‍కు దారితీసినట్లు అధికారులు తెలిపారు. సిద్ధూ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు షార్ప్ షూటర్లు జగ్‌దీప్ సింగ్ రూప, మన్ను కుసా(మన్‌ప్రీత్ సింగ్) ఇక్కడే తలదాచుకున్నారు. పోలీసుల కాల్పుల్లో ఈ ఇద్దరు నిందితులు చనిపోయినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)