Andhra Pradesh Assembly Session 2024: వీడియో ఇదిగో, మీరు కట్టుకున్న చీర చేనేతదేనా, ఎమ్మెల్యే లోకం మాధవిని సరదాగా ప్రశ్నించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ
ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా... ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చమత్కారాలు, ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయిన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో చేనేత సమస్యలపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ... చేనేత కార్మికుల సమస్యలను లేవనెత్తారు.
అనంతరం రఘురాజు మాట్లాడుతూ లోకం మాధవి మాట్లాడిన తీరును అభినందించారు. చేనేత సమస్యలను చక్కగా వివరించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా... ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి.
Andhra Pradesh Assembly Session 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)