Andhra Pradesh: వీడియో ఇదిగో, లేటు వయసులో పెళ్లి చేసుకున్న భర్తకు షాకిచ్చిన భార్య, తన ఇంటికి తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది.

Wife Cheating Husband after 15 days Marriage in Bhimavaram Watch Video (Photo-X/Screen Grab)

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో పెళ్లైన పదిహేను రోజులకే భర్తకు ఓ భార్య బిగ్ షాకిచ్చింది. భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత భర్తతో కాపురం చేయడానికి నిరాకరించిన భార్య.. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం తీసుకెళ్లాలని భర్తతో పోరు పెట్టుకుంది.

దారుణం, పసిబిడ్డ మెడపై కత్తిపెట్టి తల్లిపై గ్యాంగ్ రేప్, దొంగతనం కోసం వచ్చి కామాంధులైన దొంగలు, పాప కోసం ఏడుస్తూ లొంగిపోయిన మాతృ హృదయం

ఆమె మాటలు నమ్మిన భర్త తనను తీసుకుని రైలు ఎక్కారు. ఈ క్రమంలోనే ఆమె అతనికి భారీ షాక్ ఇచ్చింది. తాను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదని.. సదరు భర్తకు మస్కా కొట్టి ఉడాయించింది. దీంతో కంగుతిన్న భర్త వెంటనే ఆమెకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ రావడంతో తాము మోసపోయినట్లు గమనించాడు. భీమవరం తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య బెదిరించిందని బాధితుడు వాపోయాడు. ఈ నేపథ్యంలో అతను తనను మోసం చేసిన భార్యతో పాటు, మ్యారేజ్ బ్రోకర్‌పై హిందూపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)