భువనేశ్వర్, అక్టోబర్ 2: భువనేశ్వర్‌లో ఓ మహిళపై ఇద్దరు దుండగులు పసిబిడ్డను కత్తితో బందీగా ఉంచి లైంగికంగా వేధించిన ఘటన (Woman Gangraped at Knifepoint) కలకలం రేపింది. నివేదికల ప్రకారం, ఆదివారం, సోమవారం మధ్య రాత్రి సమయంలో నగరంలోని మైత్రి విహార్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన (Woman Gangraped) జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తన రెండేళ్ల కుమార్తెతో కలిసి అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో ఉంటోంది.
బాధితురాలు బాల్కనీ తలుపులు వేయడం మరచిపోవడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇద్దరు దోపిడీ దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. వారు గదిలోకి ప్రవేశించినప్పుడు మహిళ బాత్రూంలో ఉంది. బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దోపిడి దొంగలు మహిళను, ఆమె పసిబిడ్డను బందీలుగా పట్టుకున్నారు. ఇంతలో, బాధితురాలు తన కుమార్తెకు హాని కలిగించవద్దని దోపిడీదారులను వేడుకుంది.
స్కూటీ నడుపుతున్న మహిళపై కామాంధుడు దారుణం, అక్కడ తాకుతూ అసభ్యప్రవర్తన, వీడియో ఇదిగో..
అనంతరం రూంలో నగదు, బంగారు ఆభరణాల కోసం దోపిడీ దొంగలు వెతికారు. బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లే ముందు వారు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మైత్రి విహార్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దోపిడీ దొంగలు హిందీలో మాట్లాడుతున్నారని, వారు ఒడిశా వెలుపలి ప్రాంతాలకు చెందిన వారని సూచిస్తోందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, ఇటీవల మైత్రి విహార్ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కమిషనరేట్ పోలీసు వర్గాలు బుధవారం ఉదయం తెలిపాయి. రాజధాని నగరంలో నగర పోలీసులు నిర్వహిస్తున్న నైట్ పెట్రోలింగ్, బ్లాక్ మరియు చెకింగ్ డ్రైవ్‌పై ఈ సంఘటన తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తింది. సెప్టెంబర్ 15న నగరంలోని పోలీస్ స్టేషన్‌లో ఆర్మీ అధికారిపై క్రూరంగా దాడి చేసి, కాబోయే భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై భువనేశ్వర్ పోలీసులు ఇటీవల నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.