Another Manipur Shocker: మణిపూర్‌లో మరో వీడియో వైరల్, వ్యక్తి తల నరికి చెట్టుకు వేలాడదీసిన ఓ వర్గం వారు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌గా మారింది.

Violence in Manipur (Image Credits - Twitter/@MangteC)

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌గా మారింది. ఈ దారుణ సంఘటన జులై 2న బిష్ణుపూర్‌ జిల్లాలో చోటుచేసుకంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు దారుణంగా చంపారు.

డేవిడ్ థీక్‌ అనే వ్యక్తి తల నరికి.. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మణిపూర్ ఇంఫాల్ లోయలో ఉన్న మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, కొండలలో ఉన్న గిరిజన కుకీల మధ్య మే నుండి జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. మణిపూర్ లో చెలరేగుతున్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 160 మంది చనిపోయారు. ఇళ్లు దగ్ధం కావడంతో నిరాశ్రయులైన వేలాది మంది ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

Here's Disturbed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now