Chiranjeevi Meet CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి...వరద సాయం చెక్కు చంద్రబాబుకు అందజేత...
ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి, వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సాదర స్వాగతం పలికిన సిఎం చంద్రబాబు నాయుడు, భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)