Arun Gandhi Dies: మ‌హాత్మా గాంధీ మ‌నుమ‌డు అరుణ్ గాంధీ కన్నుమూత, అనారోగ్యంతో కొల్హాపూర్‌లో తుది శ్వాస విడిచిన సామాజిక కార్య‌క‌ర్త‌

మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 89 ఏళ్లు. గ‌త కొంత కాలం నుంచి ఆయ‌న అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఇవాళ కొల్హాపూర్‌లో అరుణ్ గాంధీకి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నట్లు ఆయ‌న కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు.

Arun Gandhi (Photo Credits: Twitter@waglenikhil)

మ‌హాత్మా గాంధీ మ‌నుమ‌డు అరుణ్ గాంధీ(Arun Gandhi) క‌న్నుమూశారు. మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 89 ఏళ్లు. గ‌త కొంత కాలం నుంచి ఆయ‌న అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఇవాళ కొల్హాపూర్‌లో అరుణ్ గాంధీకి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నట్లు ఆయ‌న కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. మ‌నీలాల్ గాంధీ, సుశీల మ‌షుర్‌వాలా దంప‌తుల‌కు 1934, ఏప్రిల్ 14వ తేదీన డ‌ర్బ‌న్‌లో అరుణ్ గాంధీ జ‌న్మించారు. మ‌హాత్మా గాంధీ అడుగుజాడ‌ల్లో అరుణ్ గాంధీ న‌డిచారు. సామాజిక కార్య‌క‌ర్త‌గా ఎదిగారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)