Assam Earthquake: గౌహతిలో అర్థరాత్రి భారీ భూంకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు, నిద్ర మత్తులోనే ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

గురువారం ఉదయం 5.42 గంటలకు గువాహటిలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది

Earthquake Representative Image (Photo Credit: PTI)

అస్సాం రాజధాని గువాహటిలో (Guwahati) భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 5.42 గంటలకు గువాహటిలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది.ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా వెల్లడించింది.

ఎన్‌సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుతుండగా ఈ భూప్రకంపనలు సంభవించాయి. భూమి లోపల 5 కిలో మీటర్ల లోతులో 26.63 డిగ్రీల అక్షాంశం, 92.08 డిగ్రీల రేఖాంశం మధ్య భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)