Prashant Kishor: ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌కు జ‌నం ఆక‌ర్షితులు కావొద్దు, ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు, ఈ ఎన్నికలు 2024ను డిసైడ్ చేయలేవని తెలిపిన ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త

ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించిన ప్ర‌శాంత్ కిషోర్‌.. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుంద‌ని, కానీ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా 2024ను నిర్ణ‌యించ‌లేర‌న్నారు. ఈ విష‌యం సాహెబ్‌కు తెలుసు అని, కానీ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా త‌మ పార్టీ వైపు అంద‌ర్నీ మ‌ళ్లించేందుకు ప్ర‌ధాని ఓ తెలివైన ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ప్రతిప‌క్షాల‌పై నిర్ణ‌యాత్మ‌క సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోపించారు.

Prashant Kishor (Photo Credits: IANS)

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ప్రధాని మోదీ.. 2024 తీర్పును ప్ర‌జ‌లు 2022లోనే వెలువ‌రించిన‌ట్లు వ్యాఖ్య‌లు చేసిన సంగతి విదితమే. దీన్ని ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ త‌ప్పుప‌ట్టారు. ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌పై సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకోవ‌డానికి చేసిన‌వేనన్నారు. ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించిన ప్ర‌శాంత్ కిషోర్‌.. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుంద‌ని, కానీ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా 2024ను నిర్ణ‌యించ‌లేర‌న్నారు. ఈ విష‌యం సాహెబ్‌కు తెలుసు అని, కానీ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా త‌మ పార్టీ వైపు అంద‌ర్నీ మ‌ళ్లించేందుకు ప్ర‌ధాని ఓ తెలివైన ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ప్రతిప‌క్షాల‌పై నిర్ణ‌యాత్మ‌క సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోపించారు. ప్ర‌ధాని మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌కు జ‌నం ఆక‌ర్షితులు కావొద్దు అని, త‌ప్పుదోవ ప‌ట్టించే రీతిలో ఆ వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లు ప్ర‌శాంత్ కిషోర్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now