Kannada Language Row: బెంగుళూరులో హై టెన్సన్, కన్నడ భాషలో నేమ్‌ ప్లేట్స్‌ లేని హోటల్స్‌పై దాడులకు దిగిన కన్నడ సంఘాలు, వెంటనే వాటిని తొలగించి కన్నడలో రాసుకోవాలని డిమాండ్

కర్ణాటకలో మరోసారి కన్నడ భాషా ఉద్యమం ఊపందుకుంది. నేమ్‌ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి.

Kannada Raksha Vedhike holds a protest demanding all businesses and enterprises in Karnataka to put nameplates in Kannada (Photo-ANI)

కర్ణాటకలో మరోసారి కన్నడ భాషా ఉద్యమం ఊపందుకుంది. నేమ్‌ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎయిర్‌పోర్ట్‌ బయట కన్నడ కాకుండా ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో నేమ్‌ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది.

కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌ బయట ఇతర భాషల నేమ్‌ బోర్డుల్ని ధ్వంసం చేసింది. బెంగళూరు వ్యాప్తంగా హోటల్స్‌పైనా కన్నడ సంఘాలు దాడులకు దిగాయి. ఇంగ్లీష్‌లో నేమ్‌ ప్లేట్స్‌ ఉన్న హోటళ్లలోకి దూసుకెళ్లాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. దుకాణాలకు ఫిబ్రవరి చివరికల్లా కన్నడ భాషలో నేమ్‌ ప్లేట్స్‌ గనుక ఉండకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవంటూ BBMP హెచ్చరించింది

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement