Bengaluru Rains: బెంగుళూరులో భారీ వర్షం, కారు మునిగిపోవడంతో ఏపీ మహిళ మృతి, నీటితో నిండిపోయిన కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌

కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌ నీటితో నిండిపోయింది. ఇందులో ఏపీకి చెందిన కృష్ణా జిల్లా కారు ఒకటి చిక్కుకుపోయింది.

Rains

కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌ నీటితో నిండిపోయింది. ఇందులో ఏపీకి చెందిన కృష్ణా జిల్లా కారు ఒకటి చిక్కుకుపోయింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉండగా వారిని సహాయక సిబ్బంది రక్షించింది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోయిన క్రమంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వీరిని సెయింట్‌ మార్తాస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, పరిస్థితి విషమించడంతో భానురేఖ అనే మహిళ మృతిచెందింది. ఈమెది కృష్ణాజిల్లాలోని తేలప్రోలు.కబ్బన్‌ పార్క్‌ చూసేందుకు కృష్ణా జిల్లాకు చెందిన ఒక కుటుంబం కారులో వచ్చింది. ఈ క్రమంలోనే కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌ వద్ద కారు నీటిలో చిక్కుకుపోగా, దానిపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది కారును ఎట్టకేలకు బయటకు తీశారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement