Bharat Gaurav Train Food Poisoning: భారత్ గౌరవ్ రైలులో పుడ్ పాయిజన్ కలకలం, 40 మంది ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత, విచారణ జరుపుతున్న రైల్వే శాఖ అధికారులు

మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్‌లో పాయిజన్ కలకలం రేగింది. చెన్నై నుంచి పుణెకు వస్తున్న భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రైలు పూణె చేరుకోగానే ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Credits: ANI

మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్‌లో పాయిజన్ కలకలం రేగింది. చెన్నై నుంచి పుణెకు వస్తున్న భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రైలు పూణె చేరుకోగానే ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైలు పూణే చేరుకోగానే 80 మంది ప్రయాణికుల అనారోగ్యానికి గురైనట్లు తమకు ఫిర్యాదు అందిందని పూణే రైల్వే అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆ తర్వాత వారికి రైల్వేస్టేషన్‌లోనే ప్రథమ చికిత్స అందించి, ఆ తరువాత బాధితులను ససూన్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలులో ఉన్న కొందరు యువకులు రైలులోని వారికి కలుషిత ఆహారం ఇచ్చారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement