Bhopal Shocker: భార్య ముందు అంకుల్ అని పిలిచినందుకు షాప్ ఓనర్‌ని చితకబాదిన భర్త, వీడియో ఇదిగో..
భార్య ముందు తనను అంకుల్ అని పిలిచినందుకు షాప్ ఓనర్ ని ఓ భర్త చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ సిటీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్ కు చెందిన విశాల్ శాస్త్రికి స్థానికంగా జాట్ ఖేడి ప్రాంతంలో ఓ బట్టల దుకాణం ఉంది.

శనివారం ఎప్పటిలాగే తన షాపులో కూర్చున్న శాస్త్రి.. వచ్చిన కస్టమర్లకు బట్టలు చూపిస్తున్నాడు. ఇంతలో భుజాన చంటిపిల్లాడితో ఓ జంట వచ్చింది. చీరలు కావాలనడంతో శాస్త్రి తన షాపులోని వివిధ వెరైటీలను చూపించాడు. ఈ క్రమంలోనే అంకుల్ మీకు ఏ ధరలో కావాలో చెప్పాలంటూ శాస్త్రి ఆ కస్టమర్ ను అడిగాడు. తన భార్య ముందే తనను అంకుల్ అని పిలవడంపై సదరు కస్టమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన స్నేహితులతో వచ్చి శాస్త్రిపై దాడి చేశాడు. షాపులో నుంచి శాస్త్రిని బయటకు లాగి బెల్ట్, రాడ్, హాకీ స్టిక్ లతో చితకబాదారు. ఇదంతా షాపు ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. శాస్త్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు కస్టమర్ ను రోహిత్ గా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Man Beats Shopkeeper for Calling Him ‘Uncle’ in Front of Wife
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)