Rakesh Jhunjhunwala Dies: భారతీయ బిలియనీర్ రాకేష్ జున్‌జున్‌వాలా మృతి, సంతాపం వ్యక్తం చేసిన పలువురు వ్యాపార ప్రముఖులు
ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నేటి ఉదయం 6.45 గంటలకు ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ఆస్పత్రికి తరలించారు.
స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్, ఆకాశ ఎయిర్ స్థాపకుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నేటి ఉదయం 6.45 గంటలకు ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ఆస్పత్రికి తరలించారు. ఝున్‌ఝున్‌వాలాను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ట్రేడర్‌గా చార్టెడ్ అకౌంటెంట్‌గా ఎంతో పేరుగడించిన ఆయన.. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. తన వ్యాపార చిట్కాలతో ఆయన వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారు. ఆయన మృతిపై పలువురు వ్యాపార ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)