Bishnu Charan Sethi Dies: కిడ్నీ సంబంధిత సమస్యలతో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ మృతి, సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసినట్లు సమాచారం.
ఒడిషా బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ(61) మృతి చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసినట్లు సమాచారం. లంగ్ ఇన్‌ఫెక్షన్, మెదడులో రక్తస్రావం గత రెండు నెలలుగా ఆయన ఐసీయూలోనే ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. బిష్ణు చరణ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. ఒడిషా గవర్నర్ గణేషీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలియజేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)