BJP MP Diya Kumari: తాజ్ మహల్ కట్టిన ప్రాంతం మాది, షాజహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దివ్యకుమారి

తాజ్ మహల్ కట్టిన స్థలం మాదేనంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దివ్యకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రాలో తాజ్ మహల్ కట్టిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు, మా పూర్వీకులు జైసింగ్‌ది. అందుకు తగ్గ ఆధారాలు మా పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి. అయితే షాజహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడు.

BJP MP Diya Kumari (Photo-ANI)

తాజ్ మహల్ కట్టిన స్థలం మాదేనంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దివ్యకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రాలో తాజ్ మహల్ కట్టిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు, మా పూర్వీకులు జైసింగ్‌ది. అందుకు తగ్గ ఆధారాలు మా పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి. అయితే షాజహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ కాలంలో న్యాయవ్యవస్థ, అప్పీలుకు వెళ్లే అవకాశం లేదు. మా దగ్గర ఉన్న రికార్డులను పరిశీలిస్తే విషయం ఏంటో మీకే తెలుస్తుందని వెల్లడించారు. అంతేకాక, తాజ్ మహల్‌ కింద ఉన్న 22 గదులను తెరవాలన్న పిటిషన్‌ను దివ్యకుమారి సమర్ధించారు. ‘ఆ గదులు తెరచుకుంటే తాజ్ మహల్ కంటే ముందు ఏముండేదో అందరికీ తెలుస్తుంది. అక్కడ గుడి కూడా ఉండి ఉండవచ్చు. అందుకని ఏం ఉండేదో తెలుసుకునే హక్కు అందరికీ ఉందని అభిప్రాయపడ్డారు. అయితే తమ రాజవంశీకుల రికార్డులను తాను పూర్తిగా పరిశీలించలేదనీ, వాటిపై ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఏం చేయోలో నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement