Brij Bhushan Sharan Singh Gets Bail: రెజ్ల‌ర్లపై లైంగిక వేధింపుల కేసు, బ్రిజ్ భూష‌ణ్‌ సింగ్‌కు బెయిల్ మంజూరు, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూష‌ణ్‌(Brij Bhushan)కు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. అడిష‌న‌ల్ చీఫ్ మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ హ‌ర్జిత్ సింగ్ జ‌స్పాల్ ఈ ఆదేశాల‌ను జారీ చేశారు. బీజేపీ ఎంపీ, భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్ త‌మ‌ను లైంగికంగా వేధించిన‌ట్లు మ‌హిళా రెజ్ల‌ర్లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

WFI Chief Brij Bhushan Sharan Singh (Photo Credit: ANI)

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూష‌ణ్‌(Brij Bhushan)కు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. అడిష‌న‌ల్ చీఫ్ మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ హ‌ర్జిత్ సింగ్ జ‌స్పాల్ ఈ ఆదేశాల‌ను జారీ చేశారు. బీజేపీ ఎంపీ, భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్ త‌మ‌ను లైంగికంగా వేధించిన‌ట్లు మ‌హిళా రెజ్ల‌ర్లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌పై కొన్ని ష‌ర‌తుల‌ను విధించామ‌ని, ఈ కేసులో సాక్ష్యుల‌ను ఆయ‌న ప్ర‌భావితం చేయ‌రాదు అని, అనుమ‌తి లేకుండా దేశాన్ని విడిచి వెళ్ల‌రాదు అని, అన్ని కండీష‌న్స్ త‌ప్ప‌కుండా పాటించాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.బ్రిజ్ భూష‌ణ‌తో పాటు వినోద్ తోమ‌ర్‌కు కూడా కోర్టు బెయిల్‌ను మంజూరీ చేసింది. 25వేల పూచీక‌త్తుపై ఆ ఇద్ద‌రికీ రెగ్యుల‌ర్ బెయిల్‌ను ఇచ్చారు. ఈ కేసులో త‌రుప‌ది విచార‌ణ జూలై 28న ఉంటుంద‌ని కోర్టు తెలిపింది.

Live Law Tweet

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement