Dr Bhagwat Karad: గాల్లో విమానం, ప్రయాణికుడికి తీవ్ర అస్వస్థత, వైద్యం చేసి కాపాడిన కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
కేంద్ర మంత్రిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే.. గత రాత్రి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయల్దేరారు.
వృత్తిరీత్యా డాక్టర్ అయిన కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. కేంద్ర మంత్రిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే.. గత రాత్రి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయల్దేరారు. తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. తలనొప్పిగా ఉందని తెలిపాడు. బీపీ లెవల్స్ కూడా తగ్గాయి. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని కేంద్ర మంత్రి గమనించి తక్షణమే వైద్యం అందించాడు. గ్లూకోజ్ అందించడంతో సదరు ప్రయాణికుడు త్వరగా కోలుకున్నాడు. దీంతో ఇండిగో యాజమాన్యం కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్‌పై ప్రశంసలు కురిపించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)