CBI Raids Karti Chidambaram Premises: చైనా కంపెనీలతో లాలూచీ, ఎంపీ కార్తీ చిదంబరం నివాసంపై ఏసీబీ దాడులు, మొత్తం తొమ్మిది చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు
కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం దాడులు చేపట్టింది. కార్తీ నివాసాలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. వీసా స్కాంలో భాగంగా ఢిల్లీ, చెన్నై, ముంబై, శివగంగైలోని మొత్తం తొమ్మిది చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం దాడులు చేపట్టింది. కార్తీ నివాసాలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. వీసా స్కాంలో భాగంగా ఢిల్లీ, చెన్నై, ముంబై, శివగంగైలోని మొత్తం తొమ్మిది చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చైనా కంపెనీలతో కార్తీ చిదంబరం లాలూచీ పడ్డారని, చైనీయులకు వీసాలు ఇప్పించడంలో లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలపై సీబీఐ సోదాలు చేపట్టింది. ఇంతకముందు సీబీఐ ప్రాథమిక విచారణ జరిపి కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. ఇక సీబీఐ దాడులపై కార్తీ చిదంబరం స్పందించారు. తనపై సీబీఐ ఎన్నిసార్లు దాడులు జరిపారో లెక్కే లేదని, ఇదొక రికార్డై ఉంటుందని సెటైర్ వేశారు.