Chhattisgarh: మొబైల్ వాడొద్దని తిట్టిన తల్లిదండ్రులు, మనస్థాపంతో జలపాతం పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన కూతురు, వీడియో ఇదిగో..
ఓ బాలిక జలపాతంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఆమెను స్థానికులు సకాలంలో రక్షించారు
ఛత్తీస్‌గఢ్‌లోని 'మినీ నయాగరా'గా పిలువబడే చిత్రకోట్ జలపాతం సమీపంలో షాకింగ్ సంఘటన జరిగింది. ఓ బాలిక జలపాతంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఆమెను స్థానికులు సకాలంలో రక్షించారు. 21 ఏళ్ల యువతి పేరు సరస్వతి మౌర్య అని అదనపు పోలీసు సూపరింటెండెంట్ నవోదితా పాల్ తెలిపారు. ఆమె ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడిపేది. ఆమె అలవాటుతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. దీంతో సరస్వతిని వారు మొబైల్ వాడటం ఆపేయాలని తిట్టడంతో మనస్థాపం చెందింది. ఈ నేపథ్యంలోనే యువతి చిత్రకోట్ జలపాతం దగ్గరకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
Here's Video