![](https://test1.latestly.com/wp-content/uploads/2024/05/crime-scene.jpg?width=380&height=214)
Tripura, Feb 14: త్రిపుర (Tripura) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జరిగింది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త (Husband) క్షణాకావేశంలో భార్య (Wife)ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్‌స్టేషన్ (Amtali police station) పరధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు భార్యను హత్య చేసిన అనంతరం రాత్రంతా ఆ మృతదేహంతో ఇంట్లోనే గడిపాడు. మళ్లీ రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భార్యను చంపిన విషయం చెప్పి లొంగిపోయాడు. అలర్ట్ అయిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్యామల్ పాల్ వివరాల ప్రకారం.. అమ్తాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే శ్యామ్‌లాల్ దాస్ మంగళవారం రాత్రి తన భార్య స్వప్నతో గొడవపడ్డాడు. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో క్షణికావేశానికి లోనైన శ్యామ్‌లాల్ బరువైన వస్తువుతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దాంతో ఆమె విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం రాత్రంతా అతను ఇంట్లో భార్య మృతదేహంతో ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి హత్య విషయం చెప్పాడు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం ఘటనా ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షకు పంపి దర్యాప్తు ప్రారంభించారు.