Justice UU Lalit: సుప్రీంకోర్టు త‌దుప‌రి చీఫ్ జ‌స్టిస్‌గా యుయు ల‌లిత్, సిఫారసు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసిన చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

సుప్రీంకోర్టు త‌దుప‌రి చీఫ్ జ‌స్టిస్‌గా యుయు ల‌లిత్ పేరును చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సిఫారసు చేశారు.ఎన్వీ ర‌మ‌ణ ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. రిక‌మండేష‌న్ లెట‌ర్‌ను కూడా జ‌స్టిస్ ల‌లిత్‌కు సీజేఐ ర‌మ‌ణ అంద‌జేశారు.

CJI NV Ramana Recommends Justice UU Lalit As Next Chief Justice of India

సుప్రీంకోర్టు త‌దుప‌రి చీఫ్ జ‌స్టిస్‌గా యుయు ల‌లిత్ పేరును చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సిఫారసు చేశారు.ఎన్వీ ర‌మ‌ణ ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. రిక‌మండేష‌న్ లెట‌ర్‌ను కూడా జ‌స్టిస్ ల‌లిత్‌కు సీజేఐ ర‌మ‌ణ అంద‌జేశారు. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు నుంచి బుధ‌వారం రాత్రి సీజేఐ సెక్ర‌టేరియేట్‌కు ఫోన్ కాల్ వెళ్లింది. త‌దుప‌రి సీజేఐ పేరును ప్ర‌తిపాదించాల‌ని మంత్రి రిజుజు ఎన్వీ ర‌మ‌ణ‌ను కోరారు. చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 26వ తేదీన ముగియ‌నున్న‌ది. ఆ త‌ర్వాత జ‌స్టిస్ ల‌లిత్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. అయితే చాలా త‌క్కువ కాల‌మే జ‌స్టిస్ ల‌లిత్ ఆ ప‌ద‌విలో ఉండ‌నున్నారు. ఆయ‌న న‌వంబ‌ర్ 8వ తేదీన రిటైర్ అవుతారు. జ‌స్టిస్ ల‌లిత్ త‌ర్వాత జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సీజే అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే చంద్రచూడ్ మాత్రం రెండేళ్లు సీజేఐగా చేసే ఛాన్సు ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement